తక్కువ పెట్టుబడితో ఏదైనా వ్యాపారం చేయాలనుకునే వారికి..మనం ఈ సైట్ ద్వారా ఇప్పటికే ఎన్నో ఐడియాస్ ఇచ్చాం..వాటిని చాలామంది వాడుతున్నారు కూడా.. అందుకే మీకోసం..ఇంకో ఐడియాతో వచ్చాం.. కేవలం రూ. 22, 000 వేలతో ప్రారంభించి నెలకు రూ. 50 వేలకు పైగా సంపాధించే ఒక వ్యాపారం ఉంది.
మీరు కార్ వాషింగ్ బిజినెస్ గురించి విని ఉంటారు. ఇది మీకు రోడ్డు పక్కన కనిపించే సాధారణ వ్యాపారంలా ఉండొచ్చు.. కానీ.. ఈ వ్యాపారంలో పెద్ద మొత్తంలో డబ్బు వచ్చే అవకాశం ఉంటుందని మీకు తెలుసా… ఈ వ్యాపారం మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. మీకు అదృష్టం కలిసొస్తే.. మెకానిక్‌ని కూడా నియమించుకుని వాషింగ్‌తో పాటు, మీరు కారు రిపేరింగ్ బిజినెస్ కూడా ప్రారంభించవచ్చు.
ఎలా ప్రారంభించాలి?
కార్ వాషింగ్ కోసం ప్రొఫెషనల్ మెషిన్ అవసరం. మార్కెట్లో అనేక రకాల యంత్రాలు ఉన్నాయి. ఈ యంత్రాల ధర రూ.12 వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటుంది. మీరు చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, మీరు తక్కువ ఖర్చుతో కూడిన యంత్రాన్ని కొనుగోలు చేయండి.. దీని కోసం మీరు రూ.14,000తో ఒక యంత్రాన్ని కొన్నారనుకుందాం.. ఈ ధరతో మీరు రెండు హార్స్ పవర్ యంత్రాలని పొందుతారు. అదనంగా, మీరు 30 లీటర్ల వాక్యూమ్ క్లీనర్‌ను కొనుగోలు చేయాలి. దీని ధర దాదాపు రూ. 9 వేల నుంచి రూ.10 వేల రూపాయలు. షాంపూ, గ్లోవ్స్, టైర్ పాలిష్ మరియు డాష్‌బోర్డ్ పాలిష్‌తో సహా అన్ని వస్తువులకు రూ. 2 వేల వరకు ఖర్చు అవుతుంది.
మీరు రద్దీ లేని ప్రదేశంలో మీ వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. తద్వారా ఇతరులకు ఇబ్బంది ఉండదు. ఏవరైనా కార్ మెకానిక్‌తో ఒప్పందం చేసుకుంటే.. అతని రిపేర్ షాప్ పక్కనే ఈ బిజినెస్ పెట్టుకోవచ్చు. తద్వారా ఇద్దరికి మేలు చేకూరుతుంది
కార్ వాషింగ్ ఛార్జీ నగరం నుంచి నగరానికి మారుతూ ఉంటుంది. ఒక చిన్న పట్టణంలో సాధారణంగా కారు వాషింగ్ కోసం దాదాపు రూ.150-450 వసూలు చేస్తారు. పెద్ద నగరంలో ఈ ఖర్చు కాస్త ఎక్కువగానే ఉంటుంది. పెద్ద కార్లతో పాటు SUV కార్లకు కూడా అధిక ధరలు ఉంటాయి. మీరు ప్రతిరోజూ 7-8 కార్లు మీ వద్దకు వస్తే మీ రోజువారీ సంపాదన కనీసం రూ. 2,000 వరకు ఉంటుంది. అంటే నెలకు రూ. 40 వేల నుంచి రూ.50 వేలు సంపాధించవచ్చు. మీరు బిజినెస్ ప్రమోట్ చేసుకోవడానికి.. అపార్మెంట్స్ దగ్గరకు వెళ్లి..అందులో ప్రసిడెంట్స్ ఉంటారు..వారితో డీల్ మాట్లాడుకోవచ్చు. అపార్మెంట్స్లో కార్లు ఉంటాయి.. ఆ కార్లకు వాషింగ్ మీరే చేసేట్టుగా కుదుర్చుకోండి..ఫస్ట్ క్లీనింగ్‌కు ఆఫర్స్ ఇవ్వండి.. దీని ద్వారా..కష్టమర్స్ యట్రాక్ట్ అవుతారు..నాలుగు అపార్మెంట్స్తో డీల్ కుదుర్చుకోని..కాల్ చేస్తే వచ్చి కారు తీసుకెళ్లి క్లీన్ చేసి ఇచ్చేలా మీరే ఏర్పాటు చేసుకుంటే..ఇంకా బెటర్.!