ఓటీటీలోకి 12th ఫెయిల్ మూవీ తెలుగు వెర్షన్ .. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

-

గతేడాది విడుదలైన సినిమాల్లో 12th ఫెయిల్ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా ఓటీటీలోకి వచ్చిన తర్వాత మరింత క్రేజ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సినిమాకు సంబంధించిన మీమ్స్, రీల్సే. ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రాన్ని భాషలకతీతంగా ప్రేక్షకులు ఆదరించారు. ఇక ఇప్పుడు ఈ మూవీ తెలుగు వెర్షన్‌ కూడా అందుబాటులోకి వచ్చింది.

విధు వినోద్‌ చోప్రా దర్శకత్వంలో విక్రాంత్‌ మాస్సీ ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘12th ఫెయిల్‌’ తాజాగా తెలుగు వెర్షన్‌ అందుబాటులోకి వచ్చింది. డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా ఇది స్ట్రీమింగ్‌ అవుతోంది. నిన్నటి వరకు కేవలం హిందీలోనే అందుబాటులో ఉన్న మూవీ .. ఇప్పుడు తమిళ, తెలుగు భాషల్లోనూ ప్రసారం అవుతోంది. దీంతో సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం సూపర్‌ హిట్‌ను సొంతం చేసుకొని ఎన్నో రికార్డులను సాధించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version