విశాఖలో భవిత పేరుతో తాజాగా కొత్త ప్రోగ్రాం ప్రారంభించారు సీఎం జగన్. ఉపాధి పొందిన యువతతో ఏపీ సీఎం జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుల్లో క్వాలీటీ పెంచుతున్నాం. క్వాలిటీ చదువుల కోసం కరిక్యులంలో మార్పులు తీసుకొస్తున్నాం. మూడో తరగతి నుంచే టోఫిల్ శిక్షణ ఇస్తున్నాం. చదువులు అన్ని జాబ్ ఓరియెంటేడ్ గా ఉండాలి. స్కూల్స్ నుంచి కళాశాల వరకు ఎన్నో మార్పులు తీసుకొచ్చాం. 158 పారిశ్రామిక సంస్థలు వచ్చి విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తున్నాం.
రాబోయే రోజుల్లో ప్రతీ నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్ మెంట్ ఐటీ హబ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఒకేచోటనే ఐటీఐ, పాలిటెక్నిక్ అన్ని ఒకే చోట ఏర్పాటు చేస్తామని తెలిపారు సీఎం జగన్. బెస్ట్ ఐటీఐ, బెస్ట్ పాలిటెక్నిక్ తీసుకొచ్చేందుకు.. ప్రతీ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో స్కిల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. హబ్ అవసరాల మేరకు కోర్సుల్లో మార్పులు తీసుకొస్తుంది. స్కిల్ హబ్స్ నియోజకవర్గం స్థాయిలో ఇండస్ట్రీలతో ఒకటి చేసి ట్రైనింగ్.. ట్రైనింగ్ చదివిన తరువాత ఉద్యోగం వచ్చేందుకు చదువు ఉపయోగపడాలన్నారు. రాబోయే రోజుల్లో ఎక్కువ మందికి మంచి జరిగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.