కుమారి 21 ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ హీరోగా రూపొందతున్న కొత్త సినిమా 18 పేజెస్. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పరణలో.. జియో 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ లపై.. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో నితిన్ సరసన యంగ్ బ్యూ టీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. చాలా నెలలుగా మేకింగ్ లో ఉన్న ఈ మూవీ టీం తాజాగా ఓ అప్డేట్ ని అందజేసింది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా సెట్స్ పై నిఖిల్ జాయిన్ అయ్యాడని తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంకి సంబంధించిన రిలీజ్ డేట్ ను తాజాగా మేకర్స్ ప్రకటించడం జరిగింది. ఈ చిత్రం డిసెంబర్ 23, 2022న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల కాబోతుంది.
#18Pages – 23rd December Release pic.twitter.com/4duzh6y6E8
— Aakashavaani (@TheAakashavaani) October 24, 2022