దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రామమందిర ప్రారంభోత్సవ వేళ ‘హను-మాన్’ చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా కీలక పాత్రలో నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రతి టికెట్‌పై రూ.5 అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించింది.
చిత్రబృందం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘హను-మాన్’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ.. అయోధ్య రామమందిర నిర్మాణం చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని అన్నారు. రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందిందని, జనవరి 22వ తేదీన కుటుంబసభ్యులతో కలిసి అయోధ్యకు వెళ్తానని చెప్పారు.
‘‘డైపర్లు వేసుకునే స్థాయి నుంచి డయాస్‌లు ఎక్కే స్టేజ్‌కు వచ్చిన తేజ సజ్జా మరో కారణం. ట్రైలర్, టీజర్ చూసినప్పుడు ప్రతి సన్నివేశంలో ఫైన్‌నెస్ కనిపించింది. తొలిసారి ‘ఎవరీ డైరెక్టర్’ అని అడిగి మరీ తెలుసుకున్నా. హనుమంతుడు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి.” అని చిరంజీవి అన్నారు.