వైరల్ అవుతోన్న మహేష్ బాబు 81 అడుగుల భారీ కటౌట్….!!

-

సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు అనిల్ రావిపూడిల కలయికలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమా నుండి మొన్న రిలీజ్ అయిన టీజర్ తరువాత సినిమాపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఆ టీజర్ లో మహేష్ బాబు రెండు రకాల వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో పలికిన డైలాగ్స్ కు ఫ్యాన్స్ ఎంతో ఫిదా అవుతున్నారు. ఇక ఈ టీజర్ ఇప్పటికీ కూడా యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. ఇకపోతే నేడు ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్ లోని మహేష్ బాబు అడ్డాగా పేరుగాంచిన సుదర్శన్ 35 ఎం ఎం థియేటర్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు 81 అడుగుల కటౌట్ ని ఏర్పాటు చేసారు థియేటర్ యాజమాన్యం వారు.

ఈ కటౌట్ ప్రష్టుతం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ ఇండస్ట్రీగా మారిందనే చెప్పాలి. ఇంకా పూర్తిగా పాటలు కూడా రిలీజ్ కాకుండా, కేవలం ఒక్క టీజర్ రిలీజ్ తరువాత ఇంత గొప్ప రెస్పాన్స్ సంపాదించడం, అలానే అప్పుడే తమ హీరో కటౌట్ సుదర్శన్ థియేటర్ లో ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని అంటోంది సరిలేరు యూనిట్. అంతేకాక రేపు రిలీజ్ తరువాత తప్పకుండా సినిమా అందరి అంచనాలు అందుకుని మంచి విజయం అందుకోవడం ఖాయం అని ధీమా కూడా వ్యక్తం చేస్తోంది.

మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి చాలా ఏళ్ళ తరువాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుండగా మరొక నటి సంగీత, కమెడియన్ బండ్ల గణేష్ కూడా సినిమాల్లోకి కొంత గ్యాప్ తరువాత వస్తున్నారు. మంచి ఎంటర్టైన్మెంట్ తో, పలు కమర్షియల్ హంగులతో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. కాగా ఈ సినిమాను సంక్రాతి కానుకగా జనవరి 11న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతోంది సినిమా యూనిట్….!!

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version