పుష్ప-2 ప్రీ రిలీజ్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, ఆమె కొడుకు ప్రాణాలతో కిమ్స్ ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో బాధిత ఫ్యామిలీ ఫిర్యాదు మేరకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మీద కేసు నమోదవ్వగా ఆయనకు నాంపల్లి కోర్టు తొలుత 14 రోజుల రిమాండ్ విధించగా ఆయన ఒక రోజు జైల్లో గడిపారు.
అదే రోజు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చారు.తాజాగా రెగ్యులర్ బెయిల్ కోసం అల్లు అర్జున్ దాఖలు చేసిన పిటిషన్ పై నాంపల్లి కోర్టు సోమవారం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది. దీంతో అంతటా సస్పెన్స్ నెలకొంది. బన్నీకి కోర్టు బెయిల్ ఇస్తుందా? మరోసారి జైలుకు పంపిస్తుందా?అనేది తెలియాల్సి ఉంది.