జీ తెలుగు అందిస్తున్న సంపూర్ణ ఆరోగ్య సమాచారం ఆరోగ్యమే మహాయోగం పున:ప్రారంభం..

-

సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు ఉదయం 8:30 గంటలకు!

హైదరాబాద్, 17 జనవరి 2025: వైవిధ్యభరితమైన వినోదంతోపాటు విజ్ఞానం పెంపొందించే కార్యక్రమాలను అందిస్తున్న ఛానల్​ జీ తెలుగు. ప్రముఖ ఆరోగ్య సలహాదారులు మంతెన సత్యనారాయణ రాజు అందించే సలహాలు, సూచనలతో సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించుకునే సమగ్ర సమాచారం
అందించే కార్యక్రమం ఆరోగ్యమే మహాయోగం. 1278 ఎపిసోడ్స్​తో సుదీర్ఘకాలంపాటు ప్రసారమైన ఆరోగ్యమే మహాయోగం అశేష ప్రేక్షకాదరణ అందుకుంది. మరింత సమగ్ర సమాచారం, సరికొత్త సందేహాలు,
సలహాలతో ఆరోగ్యమే మహాయోగం పున:ప్రారంభం జనవరి 20న, సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు ఉదయం 8:30 గంటలకు, మీ జీ తెలుగులో!

ఈ కార్యక్రమానికి అన్నపూర్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించనుండగా ప్రముఖ ఆరోగ్య సలహాదారులు మంతెన సత్యనారాయణ రాజు ప్రేక్షకుల సమస్యలు, సందేహాలకు సరైన సలహాలు అందిస్తారు. సంపూర్ణ
ఆరోగ్యకరమైన జీవితానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, శారీరక, మానసిక ఆరోగ్యానికి జీవన శైలిలో చేసుకోదగిన సూచనలు ఈ కార్యక్రమం ద్వారా పొందవచ్చు. ఆరోగ్యం, ఫిట్​నెస్​, ఆహారం, అందం.. మొదలైన అంశాలపై సమగ్ర సమాచారం పొందేందుకు మంతెన సత్యనారాయణ రాజు అందించే సూచనలు, సలహాల కోసం జీ తెలుగు అందిస్తున్న ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమాన్ని తప్పక చూడండి!

మీ సమస్యలకు మంతెన సత్యనారాయణ సలహాలు.. ఆరోగ్యమే మహాయోగం జనవరి 20న పున:ప్రారంభం, మీ జీ తెలుగులో తప్పక చూడండి !

Read more RELATED
Recommended to you

Exit mobile version