హిజ్రాలు దారుణంగా రెచ్చిపోతున్నారు. వారు అడిగిన డబ్బులు ఇవ్వకపోతే సామాన్యులపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. దాడులకు తెగబడుతున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ర్టంలో ఆదర్శ్ వర్మ గోండ్వాన ఎక్స్‌ప్రెస్‌లోకి వచ్చిన హిజ్రాలు ప్రయాణికుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్న క్రమంలో వీరంగం సృష్టించారు.
ఓ ప్రయాణికుడిని వారు డబ్బులు అడుగగా అతను లేవని చెప్పాడు. దీంతో ఆగ్రహించిన హిజ్రాల గ్యాంగ్ అతనిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. కంపార్ట్మెంట్‌లో అందరూ చూస్తుండగానే యువకుడిని కిందపడేసి దారుణంగా తొక్కారు.అతను ఆ గాయాలు భరించలేక చనిపోయాడు. అనంతరం అతని మృతదేహాన్ని రన్నింగ్ రైలు నుంచి కిందకు విసిరేశారు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాగా, నిందితులను కఠినంగా శిక్షించాలని బాధిత ఫ్యామిలీ, నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.