నటుడు జయం రవి విడాకుల కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నటుడు జయం రవి విడాకుల కేసులో భరణం కోరుతూ పిటిషన్ వేసింది భార్య. నెలకు రూ.40 లక్షలు భరణం ఇప్పించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది ఆర్తి.

అంతకు ముందు భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేసాడు తమిళ హీరో జయం రవి. విడాకుల తర్వాత తన భార్య ఆర్తి తనను ఇంటి నుంచి గెంటివేసిందని, తన వస్తువులను తిరిగి ఇప్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేసాడు తమిళ హీరో జయం రవి.
ఈ తరుణంలోనే నటుడు జయం రవి విడాకుల కేసులో భరణం కోరుతూ పిటిషన్ వేసింది భార్య. నెలకు రూ.40 లక్షలు భరణం ఇప్పించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. కాగా హీరో రవికి మరో అమ్మాయితో ఎఫైర్ ఉందని టాక్ నడుస్తోంది. ఆ అమ్మాయి మరెవరో కాదు సింగర్ కెనీషా. ఈ అమ్మాయితో ఉన్న ఎఫైర్ కారణంగానే తన భార్యతో జయం రవి విడాకులు తీసుకుంటున్నట్లు అనేక రకాల వార్తలు వచ్చాయి.