బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహకారంతో మలేషియా జైలు నుండి స్వదేశానికి ఖానాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు చేరుకున్నారు. మలేసియా జైలులో ఉన్న పలువురిని ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జ్ భూక్య జాన్సన్ నాయక్ చొరవతో మలేసియా దేశ అధికారులతో మాట్లాడి స్వదేశానికి రప్పించారు కేటీఆర్.

ఇటీవల మలేసియాకి వెళ్లి జైల్లో ఉన్న ఖానాపూర్ వాసులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు జాన్సన్. కేటీఆర్‌ను నందినగర్ నివాసంలో మలేసియా జైలులో ఉన్న కడెం మండలంలోని లింగాపూర్‌కు చెందిన నరేశ్, భాస్కర్, శంకర్, రాజేశ్వర్, శ్రీనివాస్, దస్తురాబాద్ మండలంలోని మున్యాలకు చెందిన రవీందర్‌ల కుటుంబ సభ్యులు కలిసారూ. కేటీఆర్‌ను చూసి భావోద్వేగానికి గు రైన బాధితులు, వారి కుటుంబ సభ్యులు… అన్ని విధాలా అండగా ఉన్న కేటీఆర్‌కు జీవితాంతం రుణప డి ఉంటామన్నారు.