శరీరంలో అవయవాలు సరైన విధంగా పనిచేస్తేనే పూర్తి ఆరోగ్యం బాగుంటుంది. శరీరంలో ఉండేటువంటి భాగాలలో మూత్రపిండాలు కూడా ముఖ్యమైన భాగాలలో ఒకటి అని చెప్పవచ్చు. సాధారణంగా శరీరంలో ఉండే వ్యర్థాలను బయటకు పంపించడానికి మూత్రపిండాలు సహాయపడతాయి. అంతేకాకుండా, రక్తంలో ఉండేటువంటి మలినాలు శరీరంలోకి చేరకుండా కాపాడుతాయి. కనుక కచ్చితంగా కిడ్నీల ఆరోగ్యం బాగుందే విధంగా చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు ఎదురైనప్పుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉంటాయి.
కిడ్నీ సంబంధిత సమస్యలు ఎదురయ్యే ముందు కొన్ని రకాల లక్షణాలు కనబడతాయి. కనుక ఈ లక్షణాలను ఎదుర్కొంటే జాగ్రత్త వహించాల్సిందే. ఎప్పుడైతే కిడ్నీకు సంబందించిన సమస్యలు ఎదురవుతాయో కళ్ల చుట్టూ వాపు రావడం కూడా ఒక లక్షణమే. కొంతమంది ఎప్పుడైతే కళ్ల చుట్టూ వాపును ఎదుర్కొంటారో, అటువంటి సందర్భాల్లో కంటి పరీక్షలు నిర్వహించినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. కళ్ల చుట్టూ వాపు రావడం వల్ల ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదు అని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా, కండరాల నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే కచ్చితంగా జాగ్రత్త వహించాలి. ఇటువంటి లక్షణాలు కూడా కిడ్నీ సమస్యలకు దారి తీస్తాయి.
ఎప్పుడైతే తరచుగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లను ఎదుర్కొంటారో, కిడ్నీల ఆరోగ్యం పై జాగ్రత్త వహించాలి. అంతేకాక కిడ్నీల ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు, రక్తహీనత ఎదురవుతుంది. దీంతో నీరసం మరియు అలసట వంటి లక్షణాలు కనబడతాయి. అంతేకాకుండా మూత్రం రంగు మారడం, దుర్వాసన రావడం వంటి లక్షణాలు ఎదురవుతాయి. కనుక ఈ లక్షణాలను ఎదుర్కొంటే కచ్చితంగా కిడ్నీల ఆరోగ్యం దెబ్బతిందని గుర్తించాలి మరియు తగిన జాగ్రత్తలను తీసుకోవాలి అని డాక్టర్లు చెబుతున్నారు. మెడికేషన్ తో పాటుగా మంచినీరుని ఎక్కువగా తీసుకోవాలి మరియు తాజా పండ్లు, బెర్రీస్, చేపలు, గుడ్లు వంటి మొదలైన ఆహార పదార్థాలను తీసుకోవాలి.