ఆర్మాక్స్ ప్రకారం నంబర్ వన్ హీరో అతడే.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..!

-

ప్రతి నెల అలాగే ప్రతి ఏడాది ఎవరు నెంబర్ వన్ హీరో అనే విషయాన్ని ప్రముఖ ఆర్మాక్స్ మీడియా సంస్థ వెల్లడిస్తూ ఉంటుంది. నిజానికి మా హీరో గొప్ప అంటే.. మా హీరో గొప్ప అని అనుకునే అభిమానుల గోలలకు చెక్ పెట్టడానికి ఆర్మాక్స్ ఇలా చేస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే ఈసారి కూడా 2022 సంవత్సరానికి గాను మోస్ట్ పాపులర్ మెయిల్ ఫిలిం స్టార్ జాబితాను రివీల్ చేసింది. ఇక ఎప్పటిలాగే ఈ లిస్టులో ప్రభాస్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ విషయం తెలిసి అభిమానుల సంతోషానికి అవధులు లేవని చెప్పవచ్చు.

ఆ తరువాత స్థానాలలో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ , రామ్ చరణ్, మహేష్ బాబు , పవన్ కళ్యాణ్, నాని, విజయ్ దేవరకొండ, చిరంజీవి , రవితేజలు స్థానాలు సంపాదించుకోవడం గమనార్హం. అయితే వీరందరూ ఇప్పుడు టాప్ టెన్ హీరోలు కావడం గమనార్హం. తెలుగు స్టార్స్ లిస్టును విడుదల చేయగా ఇందులో 10 మంది మోస్ట్ పాపులర్ మేల్ ఫిలిం స్టార్స్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే వీటన్నిటికీ కారణం వారు తాజాగా ఇటీవల విడుదల చేసిన వారి సినిమాలే అందుకు కారణం అని చెప్పవచ్చు.

మిగిలిన చాలామంది హీరోలు నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ జాబితాను సోషల్ మీడియాలో బాగా చర్చ జరిపిన తర్వాతనే ఈ జాబితాను ఆర్మాక్స్ విడుదల చేసినట్లు సమాచారం. అయితే ఈ జాబితా గత ఏడాది 2022 సంవత్సరానికి సంబంధించి విడుదల చేసినట్లు సమాచారం మరి జనవరి నెలలో ఎవరు మోస్ట్ పాపులర్ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news