హిందీలో విడుద‌లకు ఆచార్య సిద్దం.. ముంబైకి చిరు!

-

మెగా స్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమాను చాలా రోజుల కింద‌నే ప్ర‌క‌టించారు. కానీ క‌రోనా వైర‌స్ వల్ల విడుద‌ల వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. కాగ తాజా గా ఈ సినిమాను హిందీలో విడుద‌ల చేయ‌డానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికే హిందీ డిస్ట్రిబ్యూట‌ర్స్ తో ఆచార్య చిత్ర బృందం చ‌ర్చ‌లు కూడా న‌డుపుతున్న‌ట్టు కూడా తెలుస్తుంది. కాగ మెగా స్టార్ చిరంజీవికి తెలుగు తో పాటు హిందీలోనూ చాలా మంది అభిమానులు ఉన్నారు.

దీంతో ఆచార్య సినిమాను హిందీలోనూ విడుద‌ల చేసినా.. మంచి క‌లెక్షన్లు వ‌స్తాయ‌ని చిత్ర యూనిట్ భావించిన్న‌ట్టు తెలుస్తుంది. అలాగే రామ్ చ‌ర‌ణకు కూడా హిందీలో కొంత వ‌ర‌కు మార్కెట్ ఉంది. దీన్ని ఉప‌యోగించుకుని హిందీలో ఆచార్య‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. అలాగే హిందీలో ప్ర‌మోషన్స్ కోసం చిరంజీవి ముంబై వెళ్ల‌డానికి కూడా సిద్ధం అవుతున్నార‌ని తెలుస్తుంది. కాగ తెలుగులో ఆచార్య సినిమా.. వేస‌వి సంద‌ర్భంగా ఏప్రిల్ 29న విడుద‌ల చేయ‌నున్నారు. అయితే హిందీలో విడుదల డేట్ గురించి చిత్ర బృందం చ‌ర్చ‌లు జ‌రుపుతున్నట్టు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version