సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఇటీవలే అరెస్ట్ అయి రాజంపేట సబ్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అయితే అస్వస్థతకు గురయ్యారని ఆసుపత్రికి తీసుకెల్లారు పోలీసులు. దీనిపై రైల్వే కోడూర్ రూరల్ సీఐ వెంకటేశ్వర్లు సంచలన విషయాలను వెల్లడించారు. రాజంపేట సబ్ జైలులో ఉన్న పోసాని స్వల్ప అస్వస్థతకు గురయ్యారని తెలిపారు.
ముఖ్యంగా పోసాని ఛాతి నొప్పి అని డ్రామా ఆడారని తెలిపారు సీఐ వెంకటేశ్వర్లు. పోసాని అడిగిన అన్ని పరీక్షలను చేయించామని.. తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి, కడప రిమ్స్ హాస్పిటల్ డాక్టర్లు ధృవీకరించారని సీఐ వెల్లడించారు. దీంతో పోసాని ని తిరిగి రాజంపేట సబ్ జైలుకు తరలించినట్టు తెలిపారు. నిన్న ఉదయం రాజంపేట సబ్ జైలుకు 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్టు కోర్టు తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం తో అంతా చర్చించుకుంటున్నారు.