జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్ లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ఇటీవలే తన పదవీకి రాజీనామా చేశారు. ఈ పరిణామం జరిగిన కొద్ది రోజుల వ్యవధిలోనే పాలనా బాధ్యతలు రాష్ట్రపతి చేతుల్లోకి వచ్చాయి. అక్కడి పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. ఇరు వర్గాల మధ్య చర్చలు జరిగే సమయంలో అడ్డంకులు సృష్టిస్తే.. ఉపేక్షించేది లేదని అలాంటి వారికి కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి ఆదేశించారు.
గతంలో పరిస్థితులు చక్కబెట్టేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చాలా సార్లు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రపతి పాలన జరిగిన తరువాత మొదటి సమీక్ష ఇది అన్నారు. ఈ సమావేశం నేడు ఢిల్లీ కేంద్రంగా జరిగింది. మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ బల్లా, ఉన్నతాధికారులు, మిలటరీ అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. రెండేళ్లుగా మణిపూర్ లో హింస కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే.