బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కు ఊహించని పరిణామం ఎదురుఅయింది. నటుడు సైఫ్ అలీ ఖాన్ తన ఇంట్లోనే కత్తితో దాడి చేశారని సమాచారం అందుతోంది. ముంబైలోని బాంద్రాలో తన ఇంట్లోకి ఒక దొంగ చొరబడి, ఆయనను పలుసార్లు కత్తితో పొడిచి ఘటనలో గాయపడ్డాడట బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్.

గురువారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో నటుడు తన ఇతర కుటుంబ సభ్యులతో కలిసి తన ఇంట్లో నిద్రిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. దింతో లీలావతి ఆసుపత్రిలో చేరాడు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్. అక్కడ అతను చికిత్స పొందుతున్నాడు. నటుడు సైఫ్ అలీ ఖాన్ తన ఇంట్లోనే కత్తితో దాడి చేశారని సమాచారం అందగానే రంగంలోకి దిగారు పోలీసులు. ఇక ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు: