సీఎం రేవంత్ రెడ్డికి షాక్..కొడంగల్ లో బీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు చోటుచేసుకున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో నుండి బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. కొడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ మండలంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సమక్షంలో, కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరారు నాయకులు, కార్యకర్తలు.
ఇక ఈ సందర్బంగా కొడంగల్ నియోజకవర్గం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి పతనం… కొడంగల్ నియోజకవర్గం నుంచే ప్రారంభం అన్నారు. ఈ నెల 17న చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ లో కేటీఆర్ సమక్షంలో జరిగే మహా ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు పట్నం నరేందర్ రెడ్డి.
సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో నుండి బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు
కొడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ మండలంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సమక్షంలో, కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు
ఈ నెల 17న చేవెళ్ల… pic.twitter.com/LbJ0fzTMrf
— Telugu Scribe (@TeluguScribe) January 15, 2025