వరంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ తరుణంలోనే ఇద్దరు స్పాట్ డెత్ అయ్యారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారి రాయగిరి సమీపంలో ప్రమాదం జరిగింది. లారీని అతివేగంతో కారు ఢీ కొట్టింది. ఇక ఈ యాక్సిడెంట్ లో ఓ మహిళతో పాటు చిన్నారి మృతి చెందింది.
ఇక వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారి రాయగిరి సమీపంలో ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్బంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మృతులు మహబూబాబాద్ జిల్లా కే సముద్రంకు చెందిన వారిగా గుర్తించారు. లారీ వెనుక భాగంగా కారు ఇరుక్కు పోయింది. స్థానికుల సహాయంతో మృతదేహాలను వెలికి తీసిన పోలీసులు… మృతదేహాలను పోస్ట్ మార్టం కు తరలించారు.