రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ ఛైర్మన్ గా నటి జయసుధ నియమితులయ్యారు. అవార్డుల కోసం అందిన నామినేషన్లను నిష్పక్షపాతంగా పరిశీలించాలని జ్యూరీ ఛైర్మన్, సభ్యులను ఎస్టీసీ చైర్మన్ దిల్ రాజు కోరారు. మంగళవారం జయసుధ అధ్యక్షతన గద్దర్ అవార్డ్స్
జ్యూరీ సమావేశం జరిగింది. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను ఛాలెంజ్ గా తీసుకుని ఈ ఎంపిక
ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ఆమె తెలిపారు.
ఈ సందర్భంగా ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ.. తెలుగు చలనచిత్ర రంగానికి జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చే విధంగా వ్యవహరించాలని జ్యూరీ సభ్యులను కోరారు. జ్యూరీలో నిష్ణాతులైన వారిని ప్రభుత్వం నియమించినట్లు తెలిపారు. 14 ఏండ్ల తర్వాత ప్రభుత్వం చలన చిత్ర అవార్డ్స్ ను
ఇస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా చలన చిత్ర అవార్డ్స్ కు ఇంత స్పందన రాలేదని చెప్పారు.