ఆదిత్య మ్యూజిక్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ లో సాయి పల్లవి పాట..!

Join Our Community
follow manalokam on social media

ప్రముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ లో బ్లాక్ బస్టర్ లిస్ట్ లో స్థానం సంపాదించుకుంది సాయి పల్లవి సారంగ దరియ సాంగ్. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వస్తున్న సినిమా లవ్ స్టోరీ. సి.హెచ్ పవన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని సారంగ దరిర్యా సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా ఆదిత్యా మ్యూజిక్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ లిస్ట్ లో చేరింది. 100 మిలియన్ వ్యూస్ కు పైగా సాధించిన బ్లాక్ బస్టర్ లిస్ట్ క్లబ్ లో సారంగ దరియా సాంగ్ కూడా చేరింది.

Adhitya Music Musical Block Buster Saranga Dariya Song

ఈ లిస్ట్ లో అల్లు అర్జున్ బుట్టబొమ్మ సాంగ్ 575 మిలియన్ వ్యూస్ తో టాప్ వన్ గా ఉండగా.. రాములో రాములా సాంగ్ 353 మిలియన్ వ్యూస్ తో సెకండ్ ప్లేస్ లో ఉంది. ఇక సాయి పల్లవి నటించిన ఫిదా సినిమాలో వచ్చిందే సాంగ్ కూడా 295 మిలియవ్ వ్యూస్ తో థర్డ్ ప్లేస్ లో ఉంది. ఇక ఈ లిస్ట్ లో నాలుగైదు స్థానాల్లో నీకన్ను నీలి సముద్రం, సీటీమర్ సాంగ్ ఉండగా.. సామజవరగమన ఆరవ స్థానంలో ఉంది. ఇక ఈ లిస్ట్ లో 100 మిలియన్ వ్యూస్ తో సారంగ దరియా కూడా స్థానం దక్కించుకుంది. సాయి పల్లవి సినిమాలో ఉంటే సాంగ్స్ కూడా సూపర్ హిట్ అన్నట్టే.. ఆ విధంగా కూడా సినిమాపై సూపర్ క్రేజ్ తెచ్చేలా చేస్తున్నారు.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...