ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాన్ని అందుకుంది. 70 స్థానాలున్న ఢిల్లీలో.. బీజేపీ 47 స్థానాల్లో విజయాన్ని అందుకుంది. ఆప్ 23 స్థానాలకే పరిమితం అయ్యింది. కాంగ్రెస్ పార్టీ అయితే ఖాతా కూడా తెరవలేదు. ఢిల్లీలో బీజేపీ విజయంపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి, ఆప్ కి ఢిల్లీ ప్రజలు పట్టం కడుతూ వచ్చారు.. 27 ఏళ్ల తర్వాత బీజేపీని అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించారని తెలిపారు. మోడీ సుపరిపాలనకు ప్రజలు ఆశీస్సులు అందించారు.. ఢిల్లీకి పట్టిన కేజీవాల్ గ్రహణం.. దేశ రాజధానికి పట్టిన పీడ విరగడైందని ఆరోపించారు.
ఢిల్లీలో నీతివంతమైన, అభివృద్ధి పాలన బీజేపీ అందించబోతుందని కిషన్ రెడ్డి తెలిపారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ కేజ్రివాల్ మారిపోయారని దుయ్యబట్టారు. అహంకారం నెత్తికిక్కితే ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో, ప్రజలు సహించరు అని మరోసారి తేలిపోయిందన్నారు. ప్రజలు డిసైడ్ అయితే కేజీవాల్, రాహుల్ గాంధీ, కేసీఆర్ ఎవరు ఆపలేరని అన్నారు. కాంగ్రెస్ డబుల్ హ్యాట్రిక్ జీరో సాధించిందని విమర్శించారు. వరుసగా మూడుసార్లు పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి జీరో సీట్లు వచ్చాయని పేర్కొన్నారు. ఆ పార్టీకి మోడీని ఓడించాలని దివాలాకోరు ఆలోచన తప్పా.. ప్రజల కోసం ఆలోచించదని దుయ్యబటారు.