Adipurush : ఏపీలో “ఆదిపురుష్” ప్రీ రిలీజ్ ఈవెంట్

-

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ కు ఉన్న క్రేజ్‌.. గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే…ప్రస్తుతం ప్రభాస్… వరుస సినిమాలతో దూసు కువెళుతున్నాడు.. నేషనల్ స్టార్ అయ్యాక మరింత స్పీడు పెంచి వరుస పెట్టి సినిమాలు ఒప్పుకుంటున్నాడు. ఇక ఇందులో ముఖ్యంగా ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ పేరుతో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

అయితే.. ఆది పురుష్ కు ఇటీవలే అప్డేట్ ఇచ్చింది మూవీటీమ్. ‘జైశ్రీరామ్..’ అంటూ సాగే పాట లిరికల్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఇది ఇలా ఉండగా తాజాగా మరో కీలక అప్డేట్ ఇచ్చింది చిత్రం బృందం. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కు ముహుర్తం ఫిక్స్‌ అయింది. ఈ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ను తిరుపతిలో జూన్‌ 6వ తేదీన నిర్వహించనున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. ఈ మేరకు ఓ పోస్టర్‌ ను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం.

Read more RELATED
Recommended to you

Exit mobile version