తనకు బీజేపీ అధ్యక్ష పదవి రాదని ఈటల క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉందంటూ జరుగుతున్న ప్రచారానికి తెరదించిన ఈటల రాజేందర్.. తనకు బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వరని తేల్చి చెప్పేశారు. ఎన్నికలు దగ్గరలో ఉన్నందున ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు, నన్ను ఎలా వాడుకోవాలో బీజేపీ అధిష్టానం ఆలోచిస్తుందన్నారు ఈటల.
బండి సంజయ్ అధ్యక్షుడిగానే కొనసాగుతారు..ఎలాంటి మార్పు ఉండదని కుండబద్దలు కొట్టి చెప్పారు ఈటల రాజేందర్. మా పార్టీ అధ్యక్షుడు మార్పు విషయం లో గతంలో నే వార్తలు వచ్చాయి.. ఎలక్షన్ దగ్గర ఉన్న ఈ సమయంలో మార్పులు ఉండకపోవచ్చని వెల్లడించారు. నన్ను ఎలా వాడుకోవలో అని అధిష్టానం ఆలోచిస్తుందని చెప్పారు ఈటల. పార్టీ లో ఉన్న పాత వారికి, ఇతర పార్టీల నుంచి వచ్చిన కొత్త వారికి ఘర్షణ వాతావరణం ఉండడం సహజం అన్నారను. పాత కొత్త అని బేదం ఉండకూడదు అని అధిష్టానమే చెబుతోంది.. ప్రజా క్షేత్రం లో పేరున్న వారికే టికెట్లు వస్తాయని వెల్లడించారు. పొంగులేటి, జూపల్లి ని ఈ మధ్య బీజేపీ పార్టీ లో చేరమని అడిగానని.. మా ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాం అన్నారని ఈటల స్పష్టం చేశారు.