టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్..ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడని చెప్పొచ్చు.
మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మేజర్’ సినిమా కు దేశవ్యాప్తంగా చక్కటి ఆదరణ లభిస్తోంది. శశి కిరణ్ తిక్క ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
ఈ సినిమాలో అడివి శేష్ నటనకు ప్రజలతో పాటు అన్ని రంగాల ప్రముఖుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవల ‘మేజర్’ టీమ్ ను అభినందించారు. కాగా, ఈ చిత్రాన్ని స్కూల్ స్టూడెంట్స్ కోసం స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. అలా విద్యార్థులతో కలిసి అడివి శేష్ సినిమా చూసిన అనంతరం వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. ‘ఇండియా లవ్ మేజర్’ అనే హ్యాష్ ట్యాగ్ ఉన్న ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సదరు వీడియో చూసి నెటిజన్లు ‘సెల్యూట్ మేజర్, గ్రేట్ డెడికేషన్ అడివి శేష్’ అని కామెంట్స్ చేస్తున్నారు. విద్యార్థులు ఈ సినిమా చూసిన అనంతరం..తమకు ఆర్మీలో జాయిన్ కావాలని ఉందని చెప్తుండటం విశేషం.