Advocate Madhu Sharma comments on lavanya: నార్సింగ్ పోలీస్స్టేషన్లో లావణ్య పై ఫిర్యాదు చేశాము…పూర్తి ఆధారాలు ముడు రోజులో పోలీసులకు సమర్పిస్తామన్నారు రాజ్ తరుణ్ తరఫు అడ్వకేట్ మధు శర్మ. లావణ్య ఆడపిల్లలకు డ్రగ్ అలవాటు చేస్తుందని..లావణ్య డిమాండ్లకు ఒప్పుకోకపోతే నానా రకాలుగా సాధిస్తుందని పేర్కొన్నారు.
న్యూడ్ వీడియోస్ పెట్టి టార్చర్ చేసిందని… ప్రీతి ఉదయ్ లకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు రాజ్ తరుణ్ తరఫు అడ్వకేట్ మధు శర్మ. ప్రీతి ఉదయలు నర్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు…రాజ్ తరుణ్ డ్రగ్స్ ఎంకరేజ్ చేయకపోవడం వల్లే రాజ్ తరుణ్ పై లావణ్య కక్ష పెంచుకుందన్నారు.
రాజ్ తరుణ్ ను ఇబ్బంది పెట్టాలన్న ఇంటెన్షన్ తో లావణ్య ఇదంతా చేస్తుంది… చాలామందిని లావణ్య డ్రగ్స్ విషయంలో ఇబ్బందులు పెడుతుందని వెల్లడించారు. డ్రగ్స్ విషయంలో లావణ్య కొంతమందిని భయపెట్టి డబ్బులు లాగలని చేసిందన్నారు రాజ్ తరుణ్ తరఫు అడ్వకేట్ మధు శర్మ.