కొడుకు పుట్టాకే సూపర్ స్టార్ కృష్ణకి కలిసొచ్చి.. హీరోగా ఎదిగాడా..?

-

తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎంతో సేవ చేసిన సూపర్ స్టార్ కృష్ణ అలియాస్ శివరామకృష్ణ ఈరోజు తెల్లవారుజామున 4:00 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ మరణం సినీ ఇండస్ట్రీని ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మరొకవైపు కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఒకే ఏడాది మూడు మరణాలు చోటు చేసుకోవడంతో మహేష్ బాబు జీవితంలో ఇంతటి కంటే దుర్భర సన్నివేశాలు మరొకటి లేదని చెప్పాలి. ఒకవైపు అన్న , మరొకవైపు తల్లి ..ఇంకొక వైపు తండ్రి ఇలా అందరూ మరణించేసరికి ఆయన ఒంటరివాడయ్యాడు అనడంలో సందేహం లేదు.

ఇదిలా ఉండగా సూపర్ స్టార్ కృష్ణ వారి అదృష్టం వల్లే ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోగలిగారు అన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి తండ్రి ప్రోత్సాహంతో 19 సంవత్సరాల మద్రాసు సినీ ఇండస్ట్రీకి చేరుకున్న కృష్ణ.. వారాహి స్టూడియో అధినేత చక్రపాణి.. ఆనందబాబులను కలిశారు. ఆ తర్వాత చక్రపాణి కృష్ణను ఎన్టీఆర్ దగ్గరకు తీసుకువెళ్లినప్పుడు వయసు ఇంకా చాలా చిన్నది.. ప్రస్తుతం అనుభవం కోసం నాటకాలలో ట్రై చేయమని తెలిపారు. ఆ తర్వాత చక్రపాణి సహాయంతో గోపాలకృష్ణ దగ్గర నాటక రంగ ప్రవేశం చేసి అక్కడ మొదటిసారి.. “చేసిన పాపం కాశీకి పోయినా ” అనే నాటకంలో శోభన్ బాబు మొదటి హీరోగా నటించగా, రెండవ హీరోగా కృష్ణ అవకాశాన్ని దక్కించుకున్నాడు.

ఆ తర్వాత “చైర్మన్” అనే నాటకంలో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే నాటకాలలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కృష్ణకు ఇందిరా దేవిని ఇచ్చి వివాహం జరిపించారు. అలా 1962 నవంబర్ 20న ఆయన పెళ్లి చేసుకున్నారు. అయితే వివాహం అయినప్పుడు కృష్ణ ఇండస్ట్రీలోకి రాలేదు. హీరో కాలేదు. ఇక పెద్ద కుమారుడు రమేష్ బాబు జన్మించిన తర్వాత కృష్ణకు మొదటిసారి హీరోగా తొలి అవకాశం లభించింది. అలా కృష్ణ వెండితెరకు తేనె మనసులు సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు. చెప్పాలంటే రమేష్ బాబు జన్మించిన తర్వాతే హీరోగా ఆయన కెరీర్ కు అదృష్టం బాగా కలిసి వచ్చింది. అంతటి అదృష్టాన్ని తెచ్చిపెట్టిన రమేష్ బాబు ఇదే ఏడాది తన కళ్ళముందే మరణించడంతో జీర్ణించుకోలేకపోయిన కృష్ణ మానసికంగా కృంగిపోయి మరణించారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news