మణిరత్నం పాదాలకు నమస్కరించిన ఐశ్వర్యా రాయ్‌.. వీడియో వైరల్‌

-

ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఫేవరెట్ హీరోయిన్ ఐశ్వర్యా రాయ్ అని అందరికీ తెలుసు. ఐష్ అంటే ఆయనకు ఎనలేని అభిమానం. ఐష్​కు కూడా మణిరత్నం అంటే ఆరాధనాభావం. ఈ ఇద్దరి కాంబినేషన్​లో ఇప్పటికే పలు చిత్రాలు వచ్చాయి. తాజాగా ఈ కాంబోలో పొన్నియన్ సెల్వన్ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు సీక్వెల్​ పీఎస్​2 కూడా వచ్చేస్తోంది. ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ చాలా గ్రాండ్​గా జరుగుతున్నాయి.

ఇందులో భాగంగానే పీఎస్2 టీమ్ ముంబయికి చేరుకుంది. ఈ ఈవెంట్‌లో ఓ అరుదైన ఇన్సిడెంట్ జరిగింది. ఐశ్వర్య రాయ్ డైరెక్టర్ మణిరత్నం కాళ్లకు నమస్కరించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇక ఐశ్వర్య సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది మణిరత్నం దర్శకత్వం వహించిన ఇద్దరూ సినిమాతోనేననే విషయం తెలిసిందే. ఈ సినిమా ఐశ్వర్య రాయ్‌కు తిరుగులేని పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత కూడా వీళ్ల కాంబోలో గురు, విలన్‌, పొన్నియన్‌ సెల్వన్‌ వంటి సినిమాలు వచ్చాయి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version