ఖరీదైన కారు కొనుగోలు చేసిన అజయ్ దేవగణ్.. ఎన్ని కోట్లంటే..?

-

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ గురించి అటు బాలీవుడ్ లోనే కాదు ఇటు టాలీవుడ్ లో కూడా ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. దృశ్యం 2 సినిమాతో కూడా ప్రేక్షకులు అలరించిన ఈయన శ్రియా శరన్, అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో తెరకెక్కగా.. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే మలయాళం లో సూపర్ హిట్ అయిన దృశ్యం చిత్రానికి రీమేక్ గా తెరకెక్కించగా మంచి విజయం సొంతం చేసుకుంది.

సాధారణంగా బాలీవుడ్ సెలబ్రిటీలు కార్లపై ఎక్కువగా మక్కువ చూపుతూ ఉంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే మార్కెట్లోకి రిలీజ్ అయిన ప్రతి కొత్త కారును కొనుగోలు చేయడానికి వారు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా అజయ్ దేవగన్ కూడా ఒక ఖరీదైన కారును కొనుగోలు చేశారు. ఈ కారు విలువ సుమారుగా రూ.2 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి అజయ్ దేవగన్ కు కార్లను సొంతం చేసుకోవడం చాలా ఇష్టం. ఈ క్రమంలోనే తాజాగా మరొక కొత్త కారును ఆయన కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ఇకపోతే అజయ్ దేవగన్ బీఎండబ్ల్యూ ఐ7 ఈవీ కార్ ను జర్మన్ కంపెనీ తయారు చేయగా.. ఇండియన్ మార్కెట్లో పలు రంగుల్లో కూడా ఈ కారు మనకు అందుబాటులో ఉంది. ఇకపోతే తాజాగా అజయ్ కొనుగోలు చేసిన ఈ ఎలక్ట్రిక్ కారులో అధునాతన సదుపాయాలు కూడా ఉన్నట్లు సమాచారం. మొత్తానికి అయితే అజయ్ దేవగన్ ఈ అధునాతనమైన కార్ ను సొంతం చేసుకోవడంతో పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version