మధ్యప్రదేశ్​లో అపాచీ హెలికాప్టర్‌ అత్యవసర ల్యాండింగ్‌

-

భారత వాయుసేనకు చెందిన ఓ అపాచీ అటాక్‌ హెలికాప్టర్‌ మధ్యప్రదేశ్‌లోని భింధ్‌ వద్ద అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. ఈ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్‌ వెంటనే దీనిని పొలాల్లో అత్యవసర ల్యాండ్‌ చేశాడు. పైలట్‌ అప్రమత్తతో ఓ పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. సాంకేతిక లోపాన్ని సరిచేసి మళ్లీ గమ్యస్థానానికి పంపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే దీనికి సాయం చేసేందుకు మరో హెలికాప్టర్‌ను అక్కడికి పంపారు. శిక్షణ కార్యక్రమంలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకొన్నట్లు సమాచారం.

భారత దళాల్లో వినియోగిస్తున్న హెలికాప్టర్లు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ నెల మొదట్లో భారత సైన్యానికి చెందిన ధ్రువ్‌ జమ్మూకశ్మీర్‌లోని కిశ్త్‌వాడ్‌ జిల్లా అటవీ ప్రాంతంలో అత్యవసరంగా దించేందుకు ప్రయత్నిస్తుండగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో సాంకేతిక నిపుణుడు పబ్బల్ల అనిల్‌(29) మృతి చెందగా, ఇద్దరు పైలట్లు గాయపడ్డారు. మార్చిలో అరుణాచల్‌ప్రదేశ్‌లోని పశ్చిమ కమెంగ్‌ జిల్లా మండలా పర్వత ప్రాంతాల్లో ఓ సైనిక హెలికాప్టర్‌ కూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version