కామెడీ కథకు ఒకే చెప్పిన అజిత్

-

‘వలిమై ‘ తర్వాత మరోసారి హెచ్.వినోద్ దర్శకత్వంలో ‘అజిత్ 61’ సినిమా షూటింగ్ మళ్లీ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అజిత్ ఒక సినిమా షూటింగ్ జరుగుతుండగా, తదుపరి సినిమా దర్శకుడు ఎవరనేది నిర్ణయిస్తారు. అది కూడా తనకు కంఫర్ట్ గా ఉండే  దర్శకులే అయితే వరుసగా వారికి అవకాశాలు ఇచ్చేస్తాడు . అలా శివతో  నాలుగు సినిమాలకు పనిచేశాడు. ఆ తర్వాత హెచ్.వినోద్‌తో మూడోసారి జతకట్టాడు.

‘అజిత్ 61’ షూటింగ్ లో అజిత్ పాల్గొంటాడా లేదా అన్నది ఇంకా కన్ఫర్మ్ కాని పరిస్థితుల్లో ‘అజిత్ 62’ సినిమా గురించి ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. లైకా సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తారని, నయనతార కథానాయికగా నటిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తారని కోడంబాక్కంలో ఓ కథనం.

అజిత్ 62 చిత్రాన్ని నిర్మించేందుకు ఏకకాలంలో మూడు సంస్థలు  సన్ పిక్చర్స్, లైకా, ఏజీఎస్ వంటి మెగా నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి . అజిత్ తో చర్చలు జరుపుతున్నాయి. అయితే తాజాగా వస్తున్న కథనం ప్రకారం విఘ్నేష్ శివన్, నయనతార, అనిరుధ్ లు అజిత్ తదుపరి చిత్రంలో లైకాతో జతకట్టనున్నారు.

విఘ్నేష్ శివన్ ఇప్పటికే అజిత్ ‘ఎన్నై అరిన్నాల్’ కోసం ‘అడరు అదరు’ అనే హిట్ పాటను రాశారు. తాజాగా ‘వలిమై ‘లో రెండు పాటలు రాయడంతో ఇప్పటికే అజిత్‌ గుడ్ బుక్‌లో ఉన్నాడు. అలాగే అనిరుధ్, నయన్ ఇంతకు ముందు అజిత్ తో కలిసి ట్రావెల్ చేశారు.

వచ్చే వారం ‘అజిత్ 62’కి సంబంధించిన ప్రకటన వెలువడినా ఆశ్చర్యం లేదు. అయితే అజిత్ 61 రిలీజ్ తర్వాత 62కి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అవుతుంది. డిసెంబర్‌లో చిత్రీకరణ ప్రారంభించే అవకాశం ఉంది. ఇదొక కామెడీ కథ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version