వినాయకుడి 32 రూపాయల్లో 16 రూపాలు ప్రధానమైనవి అందులోనూ మొదటిది బాలగణపతి రూపం భక్తుల హృదయాలను ఆకర్షించే బాలస్వామిగా గణపతి రూపం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. బంగారు రంగులో నాలుగు చేతులతో కలిగిన ఈ బాలగణపతి రూపం లో అరటి, మామిడి, చెరకు, మోదకంతో దర్శనమిస్తుంది. భూమి సమృద్ధికి చిహ్నంగా ఈ రూపాన్ని భావిస్తారు. బుద్ధి, సంతోషం సౌభాగ్యం అందించే బాలగణపతి విశిష్టతను, వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
హిందూ భక్తి సాహిత్యంలో వినాయకుడికి 32 రూపాయల ప్రసిద్ధి చెందాయి. వీటిలో బాల గణపతి మొదటి స్థానంలో నిలుస్తాడు ముగ్దల పురాణం ప్రకారం బాలగణపతి బంగారు కాంతితో నాలుగు చేతులతో దర్శనం ఇస్తాడు. ఆయన కుడి చేతిలో అరటిపండు, పనసతొన ఎడమ చేతిలో మామిడిపండు, చెరుకు గడతో దర్శనమిస్తాడు. తొండంలో మోదకం ఉండడం ఆయన బాలస్వరూపానికి నిదర్శనం. ఈ రూపం భూమిపై ఉండే సారవంతముకు, ఆహార సమృద్ధికి చిహ్నంగా భావిస్తారు.

బాలగణపతి పూజ బుద్ధి చురుకుదనాన్ని సంతోషాన్ని ప్రసాదిస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ రూపాన్ని ప్రతిరోజు సూర్యోదయ సమయంలో ‘కరస్తా కదలి చూత పనపేక్షక మోదకం బాలసుర్యం నిభం వందే దేవం బాలగణ దీపం’ అనే మంత్రంతో ఆరాధిస్తారు. ప్రతి రోజు ఉదయం ఈ మంత్రం జపించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి బుద్ధిని, సిద్ధిని మనకు అందిస్తుంది.
బాలగణపతి ఆరాధనలో అరటిపండు, కొబ్బరి, మొదకాలు సమర్పించడం ఆచారంగా వస్తుంది. గణేష్ చతుర్థి సమయంలో ఈ రూపాన్ని ప్రత్యేకంగా పూజిస్తారు. ఆయన బాల్య రూపం భక్తులకు అమాయకత్వం సరళతను సూచిస్తూ, జీవితంలో సౌభాగ్యాన్ని తెస్తుంది. ఈ రూపం విద్యార్థులకు జ్ఞానం సృజనాత్మకతను పెంచుతాయని హిందూ పురాణాలు చెబుతున్నాయి. వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా బాలగణపతి విశిష్టతను తెలుసుకొని గణపతి కృపకు పాత్రులమవుదాం..