ప్రేమ మరియు అభిమానం అన్నవి ఎలా అయినా
ఏ రూపంలో అయినా వ్యక్తం అవుతూనే ఉంటాయి
అవి దాచాలన్నా దాగవు ప్రేమకు ప్రతిరూపంగా నిలిచే
వ్యక్తులను రాజకీయంలో చూడలేం కానీ
కొన్నిసందర్భాల్లో మాత్రం ప్రేమాభిమానులు చాటుకుని
ఇతరులకు సాయం చేసిన దాఖలాలు అయితే కోకొల్లలు
ఆ విధంగా బాలయ్య ఆ విధంగా జగన్
ఇద్దరూ తన ప్రేమనూ మరియు అభిమానాన్నీ ఒకరిపై ఒకరు
చాటుకుంటూనే ఉంటారు.ఇది రాజకీయ రంగం కదా!
అని అనుకోవద్దు.. పాత కాలం ప్రేమలు ఎక్కడికీ పోవు.
బాలయ్య ప్రేమలో జగన్…ఎంతైనా అభిమాన హీరో కదా…ఆ మాత్రం ప్రేమ ఉంటుంది..మొదట నుంచి బాలయ్య అభిమానిగా జగన్ ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే..ఒకప్పుడు అంటే రాజకీయాల్లోకి రాకముందు జగన్,బాలయ్య సినిమాలకు కటౌట్లు కట్టించిన సందర్భాలు కూడా ఉన్నాయి..ఎప్పటి నుంచో ఆయన అభిమానిగా ఉన్న జగన్…ఇప్పుడు సీఎం అయ్యాక కూడా బాలయ్యపై అప్పుడప్పుడూ పాత ప్రేమలను చూపించుకుంటూనే ఉన్నారు.
వాస్తవానికి ఆ ఇద్దరూ రాజకీయ ప్రత్యర్థులైనా సరే బాలయ్యని జగన్ ఎప్పుడు ఒక మాట అనరు…బాలయ్యపై ఒక్క విమర్శ కూడా చేయరు.ఇదే సందర్భంలో వైసీపీ నేతలు కూడా పెద్దగా బాలయ్యపై విమర్శలు చేసిన దాఖలాలు లేవు..అంటే బాలయ్యపై జగన్ అభిమానం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.ఈ విధంగా బాలయ్యపై ఇష్టాన్ని జగన్ చూపిస్తూనే ఉన్నారు.ఆ మధ్య అఖండ సినిమా విషయంలో జగన్ ప్రభుత్వం బాగానే సహకరించింది…ఆ విషయాన్ని మంత్రి పేర్ని నాని సైతం చెప్పుకొచ్చారు.ఆ సినిమా సమయంలో బాలయ్యకు కావల్సిన పని చేసి పెట్టమని జగన్ చెప్పారని పేర్ని మీడియాకు వివరించిన విషయాన్ని మరువలేం.
తాజాగా అఖండ 100 రోజుల కృతజ్ఞత సభ విజయవంతం అయ్యేలా కృషి చేశారు.. కర్నూలు జిల్లాలో అఖండ 100 రోజుల సభ జరిగింది..ఈ సభని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం బాగా సాయపడింది. పోలీసులు, స్థానిక వైసీపీ నేతలు బాలయ్య సభకు పూర్తిగా సహకరించారు.
అదేవిధంగా సభ నిర్వహణ సజావుగా సాగేందుకు ..సకాలంలో అనుమతులు జారీచేశారు. ఇక ఈ సభ ద్వారా రాయలసీమలో బాలయ్య ఫాలోయింగ్ రేంజ్ ఎలా ఉంటుందో మరోసారి రుజువైంది. 100 రోజుల సభకు భారీగా అభిమానులు వచ్చారు.
వాస్తవానికి కర్నూలులో చాలామంది బాలయ్య-జగన్ కంబైన్డ్ అభిమానులు ఉన్నారు.అందుకే నిన్న సభ అనూహ్య రీతిలో విజయాన్ని నమోదు చేసింది. మొత్తానికి తన అభిమాన హీరో బాలయ్య సినిమా సభ సక్సెస్ అయ్యేలా చూసుకుని తన అభిమానాన్ని జగన్ మరోసారి చాటుకున్నారు.