అఖిల్ మిస్టర్ మజ్ను రివ్యూ & రేటింగ్

-

అక్కినేని అఖిల్, వెంకీ అట్లూరి డైరక్షన్ లో వచ్చిన సినిమా మిస్టర్ మజ్ను. బోగవల్లి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూదాం.

కథ :

అమ్మాయి కనబడితే చాలు స్ట్రెస్ రిలీఫ్ అంటూ వారిని వల్లో వేసుకునే నవ యువ మన్మధుడు విక్రం కృష్ణ అలియాస్ విక్కి (అఖిల్) రాముడి లాంటి భర్త కావాలనుకునే నిఖిత అలియాస్ నిక్కి (నిధి అగర్వాల్) ప్రేమలో పడతారు. అతని గురించి అన్ని ముందే తెలిసినా అతనిలోని మరో యాంగిల్ నచ్చి విక్కిని ప్రేమిస్తుంది నిక్కి. అయితే ఆ ప్రేమలో వారిద్దరి మధ్య చనువు పెరుగుతుంది. అయితే దాని వల్ల విక్కి తెగ ఇబ్బంది పడుతుంటాడు. ఎలాగోలా ఈ విషయాన్ని నిక్కికి తెలియచెప్పగా.. విక్కిని విడిచి వెళ్తుంది నిక్కి. ఆమె ప్రేమని వెతుక్కుంటూ వెళ్తాడు విక్కి. మరి తంకీ విక్కి, నిక్కిల ప్రేమ నెగ్గిందా.. వారు ఎలా కలిశారు అన్నది సినిమా కథ.

ఎలా ఉందంటే :

వెంకీ అట్లూరి మొదటి సినిమా తొలిప్రేమ కూడా ఇదే తరహా ప్రేమకథతో వచ్చి హిట్ కొట్టింది. అందుకే దర్శకుడు వెంకీ అట్లూరి మరో ప్రేమకథతో వచ్చాడు. అయితే ఈసారి మరి రొటీన్ సబ్జెక్ట్ తో వచ్చాడు. హీరో హీరోయిన్ ప్రేమకు వారే శత్రువులుగా మారితే ఎలా ఉంటుందన్న కథలు తెలుగులో చాలా వచ్చాయి.

అలాంటి కథతోనే మిస్టర్ మజ్ను వచ్చింది. అయితే దర్శకుడు రొటీన్ కథ అయినా మొదటి భాగం మంచి ఎమోషన, లవ్ సీన్స్ తో ఆకట్టుకున్నాడు. అయితే సెకండ్ హాఫ్ కు వచ్చే సరికి రొటీన్ గా మారిపోయింది. క్లైమాక్స్ లో ఎలాగైనా హీరో హీరోయిన్ కలుస్తారని తెలిసినా అది కూడా అన్ని సినిమాల్లానే రొటీన్ గా చేశాడు దర్శకుడు వెంకీ.

మొత్తానికి యూత్ ఆడియెన్స్ ను మిస్టర్ మజ్ను ఆకట్టుకునే అవకాశం ఉంది. ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా మెప్పించొచ్చు. అయితే మాస్ ఎలిమెంట్స్, కమర్షియల్ హంగులతో పాటుగా డిఫరెంట్ సబ్జెక్ట్ ఆశించే వారికి నచ్చదు.

ఎలా చేశారు :

అఖిల్ నటన బాగుంది. ఇచ్చిన పాత్రకు న్యాయం చేశాడు. స్టైలిష్ లుక్ తో ఆకట్టుకున్నాడు. నిధి అగర్వాల్ సవ్యసాచిలో కన్నా ఈ సినిమాలో బాగుంది. ఆమెను మంచి స్క్రీన్ స్పేస్ దొరికింది. రావు రమేష్, జయప్రకాశ్, నాబాబు పాత్రలు ఎప్పటిలానే పరిధి దాటలేదు. ప్రియదర్శి, హైపర్ ఆది అక్కడక్కడ మెప్పించారు.

జార్న్ సి విలియమ్స్ సినిమాటోగ్ర్ఫీ ఆకట్టుకుంది. ఫారిన్ లొకేషన్స్ బాగా చూపించారు. తమన్ మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోసింది. తొలిప్రేమ తర్వాత తమన్ మ్యూక్ మెప్పించింది. బిజిఎం కూడా అలరించాడు. కథ, కథనాల్లో దర్శకుడు వెంకీ అట్లూరి రొటీన్ గా వెళ్లాడు. అయితే కొన్ని సీన్స్ లో తన ప్రతిభ చాటాడ్. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

లీడ్ పెయిర్

మ్యూజిక్

సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్ రొటీన్ స్క్రీన్ ప్లే

స్టోరీ కూడా రొటీన్ గా అనిపించడం

బాటం లైన్ :

మిస్టర్ మజ్ను.. అఖిల్ హిట్ ఖాతా తెరిచాడు..!

రేటింగ్ : 3/5

Read more RELATED
Recommended to you

Exit mobile version