ఆ ప్రశ్నలకు నోరు మెదపని అల్లు అర్జున్..!

-

సంధ్య థియేటర్ తొక్కిసలాట పై పోలీసులు, అల్లు అర్జున్ పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ తరుణంలో హైకోర్టు కు  ఆయన తప్పుడు ఆధారాలను సమర్పిస్తే.. మధ్యంతర బెయిల్ రద్దవుతుందని కాంగ్రెస్ లీగల్ సెల్ వైస్ చైర్మన్ తిరుపతి తెలిపారు. నిజాలను నిగ్గు తేల్చేందుకు అల్లు అర్జున్ పోలీసులు విచారిస్తున్నారు. ముఖ్యంగా రేవతి అనే మహిళా డిసెంబర్ 04న చనిపోయినట్టు మీకు తెలియదా..? అని ప్రశ్నించారు. అలాగే తరువాత  తర్వాత రోజు వరకు తనకు తెలియదు అని మీడియాకి ఎందుకు చెప్పారని ప్రశ్నించిన పోలీసులు.

Alluarjun left for Chikkadapally police station for questioning

పోలీసులు ప్రశ్నించినటువంటి కొన్ని ప్రశ్నలపై అల్లు అర్జున్ నోరు మెదపకుండా మౌనంగా ఉన్నారు.  సంధ్య థియేటర్ వద్ద  జరిగిన తొక్కిసలాటకు సంబంధించి పది నిమిషాల వీడియోను అల్లు అర్జున్ కు విచారణ అధికారులు చూపించారు. ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు అలర్ట్ అయ్యారు. దాదాపు రెండు గంటల 40 నిమిషాల పాటు న్యాయవాది అశోక్ రెడ్డి సమక్షంలోఅల్లు అర్జున్ ని విచారణ చేశారు.   అల్లు అర్జున్ తో పాటు పోలీస్ స్టేషన్ కి తండ్రి అల్లు అరవింద్ కూడా హాజరయ్యారు. విచారణకు మాత్రం కేవలం అల్లు అర్జున్ మాత్రమే వెళ్లాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version