టాలీవుడ్లో ఎంతో బలమైన బ్యాక్‌గ్రౌండ్ ఉన్న అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరోగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్ దురదృష్టానికి కేరాఫ్‌గా మారిపోయాడన్న టాక్ వినిపిస్తోంది. ఎన్నో అంచనాలతో రూ.55 కోట్ల మార్కెట్‌తో వచ్చిన తొలి సినిమా అఖిల్ అట్టర్ ప్లాప్ అయ్యి అఖిల్, నాగార్జున ఇద్దరు పరువు తీసేసింది. ఇక సొంత బ్యానర్లో అయినా హిట్ వస్తుందేమో అని విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేసిన రెండో సినిమా హలో కూడా భారీ బడ్జెట్‌తో తీస్తే ఆ సినిమా కూడా ప్లాప్ అయ్యింది.
ఇక మూడో సినిమాగా రూటు మార్చి చేసిన లవ్‌స్టోరీ మిస్టర్ మజ్ను కూడా ప్లాప్. ఇక నాలుగో సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని అఖిల్ విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. గత ఆరు నెలల క్రితమే ఈ సినిమా పట్టాలెక్కాల్సి ఉన్నా వీళ్లు అఖిల్ కోసం హీరోయిన్ను వెతకలేకపోయారు. రష్మిక మందన్న నుంచి అటు తిరిగి ఇటు తిరిగి చివరకు లేటెస్ట్ గా హీరోయిన్ ఛాయిస్ పూజాహెగ్డే దగ్గర ఆగింది.
అఖిల్ పూజానే కావాలంటున్నాడట.. ఆమె డేట్లు ఇప్పుడు లేవు. ఆమె రేటు కూడా ఎక్కువుగా ఉందట. పూజ ఏకంగా రూ.4 కోట్లు అడిగినట్టు చెపుతున్నారు. దీంతో పూజను ఫైనల్ చేయాలంటే రేటు తెగ్గొట్టాలి. ఆమె డేట్లు ఎప్పుడు ఇస్తుందో ? అప్పటి వరకు ఆగాలి. దీంతో అఖిల్ 4వ ప్రాజెక్టు కూడా ఇప్పట్లో పట్టాలెక్కేలా లేదు. మరో హీరోయిన్ను వెతుకుదాం ? అనుకున్నా అఖిల్ పూజనే కావాలంటున్నాడట.
ఈ లెక్కన చూస్తే అఖిల్ 4వ సినిమా 2020 సమ్మర్ మినహా ఇప్పట్లో ఉండే ఛాన్సే లేదు. ఏదేమైనా తొలి మూడు సినిమాలకు కష్టాలు పడి చేసినా ప్లాపులే ఎదుర్కొన్న అఖిల్ ఇప్పుడు నాలుగో సినిమా విషయంలోనూ సవాలక్ష సమస్యలు ఎదుర్కొంటున్నాడు.