Akkineni Nagarjuna honored CM Revanth Reddy: తెలుగు సినిమా ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ ఫొటోస్ బయటకు వచ్చాయి. అయితే.. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని సన్మానించారు అక్కినేని నాగార్జున. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత, సమంత, కేటీఆర్ ఎపిసోడ్ జరిగిన తర్వాత…. సీఎం రేవంత్ రెడ్డిని సన్మానించారు అక్కినేని నాగార్జున.
దీంతో ఈ ఇద్దరి మధ్య శాంతియుత వాతావరణం నెలకొన్నట్లు సమాచారం. కాగా…ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తో భేటీ అయ్యారు సినిమా పరిశ్రమ ముఖ్యులు. ఈ సందర్భంగా టాలీవుడ్ ముందు రేవంత్ సర్కార్ కండీషన్స్ పెట్టారు. ఇకపై ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని తేల్చి చెప్పారట రేవంత్ రెడ్డి. డ్రగ్స్ వ్యతిరేక ప్రచారానికి సహకరించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేర్కొందని అంటున్నారు. ప్రచార కార్యక్రమాల్లో సినిమా హీరోలు ఉండాల్సిందేనని తెలిపారట సీఎం రేవంత్ రెడ్డి.
తెలుగు సినిమా ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ ఫొటోస్ pic.twitter.com/bI9vvTCxiw
— Telugu Scribe (@TeluguScribe) December 26, 2024