కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద వ్యక్తి హల్ చల్ చేశాడు. టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ప్రారంభం అయింది. ఈ తరుణంలోనే… కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద వ్యక్తి హల్ చల్ చేశాడు. ‘సినిమా పెద్దలు కాదు గద్దలు’ అని రాసి ఉన్న ఫ్లెక్సీని ప్రదర్శించారు కామన్ మ్యాన్. సినిమా షోలపై టికెట్ల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఒక సామాన్య వ్యక్తిగా నా ఆవేదన సీఎంతో చెప్పుకోవాలని ఆందోళనకు దిగినట్లు పేర్కొన్నాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. ఇక అటు టాలీవుడ్ ప్రముఖులు సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారట. తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని తేల్చి చెప్పారట .
కమాండ్ కంట్రోల్ వద్ద ఓ వ్యక్తి హల్చల్
సినిమా పెద్దలను తప్ప సామాన్యుల విషయాలు పట్టించుకోరా అంటూ “సినిమా పెద్దలు కాదు గద్దలు” అంటూ పట్టుకుని వచ్చిన వ్యక్తి pic.twitter.com/PsRBRRyzfW
— Telugu Scribe (@TeluguScribe) December 26, 2024