కీర్తి సురేష్ – విజయ్ డేటింగ్ చేస్తున్నారా..?

-

కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విజయ్ దళపతి, సంగీత దంపతుల జోడి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కోలీవుడ్ ఇండస్ట్రీలోనే క్యూట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకుంది ఈ జంట. విజయ్ కి సంగీత వీరాభిమాని 1996లో యూకే నుంచి వచ్చిన సంగీత స్వర్ణ లింగం విజయ్ సినిమాలు చూసి అతడిని బాగా ఇష్టపడింది. అలా ఒకసారి చెన్నైలో విజయ్ సినిమా షూటింగ్ జరుగుతుందని తెలిసి అక్కడికి వెళ్లిన సంగీత ఎంతో కష్టపడి విజయ్ తలపతిని కలిసింది. తాను విజయ్ దళపతికి చాలా పెద్ద ఫ్యాన్ అని వివరించింది. వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. తర్వాత ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి క్రైస్తవ సంప్రదాయం ప్రకారం 1999 ఆగస్టు 25వ తేదీన వివాహం చేసుకుంది ఈ జంట.

దాదాపు వీరి పెళ్లి జరిగి 22 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇలాంటి సమయంలో విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు కోలీవుడ్లో #JusticeForSangeetha అనే ట్యాగ్ లైన్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. ఇకపోతే దీనికి కారణం ప్రముఖ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ అని తెలుస్తోంది. నిజానికి విజయ్ దళపతి, కీర్తి సురేష్ కాలభైరవ , సర్కార్ వంటి సినిమాలలో నటించారు. ఇప్పుడు విజయ్ నటిస్తున్న దళపతి 67 లో కూడా ఈమె ఎన్నికయింది. దీంతో వీరిద్దరి మధ్య పరిచయం బాగా ఏర్పడి.. అది కాస్త ప్రేమకు దారి తీసింది అనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ విషయం తెలుసుకున్న సంగీత.. విజయ్ ను చాలాసార్లు హెచ్చరించిందట. కీర్తికి దూరంగా ఉండాలని కూడా సూచించిందట. కానీ విజయ్ వినకపోవడం వల్లే ఇప్పుడు విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు సంగీత విడాకులు తీసుకున్న తర్వాత విజయ్, కీర్తి సురేష్ ని పెళ్లి చేసుకుంటాడని కూడా నెట్టింట ప్రచారం జరుగుతోంది. మరి ఈ ఆరోపణల వెనుక ఉన్న నిజం తెలియాలి అంటే ఎవరో ఒకరు స్పందించాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version