గోల్డెన్ వీసా దక్కించుకున్న అల్లు అర్జున్..!

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం దేశం అంతట భారీ పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇందుకు కారణం సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప సినిమా అని చెప్పవచ్చు. స్టార్ హీరోగా పుష్ప సినిమా రాక ముందు వరకు తెలుగు, మలయాళం లోనే ఒక వెలుగు వెలిగిన ఈయన.. ఈ సినిమా తర్వాత దేశవ్యాప్తంగా పేరుతో పాటు అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ నుంచి పుష్ప 2 సినిమా కోసం ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ కూడా చిత్ర బృందం మొదలుపెట్టేసింది. ఇదిలా ఉండగా తాజాగా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఒక పోస్టు ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు.

దుబాయ్ ప్రభుత్వం అల్లు అర్జున్ కి గోల్డెన్ వీసా అందించింది. ఓ దుబాయ్ అధికారితో కలిసి దిగిన ఫోటోని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసి ఒక మంచి అనుభూతిని ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు దుబాయ్.. గోల్డెన్ వీసా ఇచ్చినందుకు ధన్యవాదాలు.. త్వరలో మళ్లీ దుబాయ్ వస్తాను అంటూ అల్లు అర్జున్ పోస్ట్ చేశాడు. ఇకపోతే అల్లు అర్జున్ గోల్డెన్ వీసా అందుకోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి దుబాయ్ గోల్డెన్ వీసా ఎక్కువగా రెగ్యులర్గా దుబాయ్ కి వెళ్లే వాళ్లకి అక్కడ బిజినెస్ చేసే వారితో పాటు పలువురు సెలబ్రిటీలకు అందిస్తూ ఉంటుంది.

ఈ గోల్డెన్ వీసాను ఐదు లేదా 10 ఏళ్లకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.. ఈ టైం లో ఎన్ని సార్లు అయినా దుబాయ్ కి వెళ్లి రావచ్చు. అక్కడ బిజినెస్ చేసుకోవచ్చు. ఇందుకోసం అక్కడి దుబాయ్ ప్రభుత్వం కూడా కొంత అమౌంట్ తీసుకుంటుంది. మన ఇండియా సెలబ్రిటీలలో ఎక్కువగా కేరళ వాళ్ళకి గోల్డెన్ వీసా వస్తూ ఉంటుంది . ఎందుకంటే వాళ్లే బిజినెస్ లను ఎక్కువగా దుబాయిలో చేస్తూ ఉంటారు. ఇప్పుడు తెలుగు సెలబ్రిటీలు కూడా ఒక్కొక్కరిగా గోల్డెన్ వీసాలను అందుకుంటూ ఉండడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version