వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ ఘోర పరాజయం తధ్యమని పార్టీకి చెందిన ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు డంకా బజాయించి చెప్తున్నారు. జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులు కూడా జగన్ పార్టీ ఓడిపోతుందని అంటున్నారు. ప్రజల్లో పార్టీ పట్ల వ్యతిరేకతని గుర్తించిన జగన్ దానిని సాధ్యమైనంత వరకు తగ్గించాలని చూస్తున్నారు. సిట్టింగ్ లో మార్పు పార్టీకి మరింత చేటు చేస్తుందని జిల్లా పార్టీ నేతలు అయితే అంటున్నారు.
ప్రజెంట్ జిల్లాలో ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అయితే జగన్ పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మేడిశెట్టి వేణుగోపాల్, సుధాకర్ బాబు, మహీధర్ రెడ్డిలు చిరక్షణం వరకు తమకి నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి టికెట్ ఇస్తారని ఆశించారు కానీ పార్టీ ప్రకటించిన జాబితాలో సీటు కేటాయించకపోవడంతో రగిలిపోతున్నారు మేడిశెట్టి వేణుగోపాల్ తన సీటు మారిస్తే ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వాలని అంటున్నారు దానికి జగన్ పూర్తిగా నిరాకరించడంతో పార్టీకి దూరంగా ఉంటున్నారు అలానే ఎమ్మెల్యే సుధాకర్ కూడా అసంతృప్తితో ఉన్నారు.