బన్నీ లీక్స్.. ‘పుష్ప 2’ డైలాగ్​ చెప్పేసిన అల్లు అర్జున్

-

ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి చిరు లీక్స్ పేరుతో ఆయన సినిమాల గురించి అప్పుడప్పుడు ఆయనే లీక్స్ ఇస్తుండే వారు. ఇప్పుడు ఆ జాబితాలో అల్లు అర్జున్ చేరిపోయాడు. బన్నీ లీక్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్‌లో గురువారం జరిగిన బేబీ సినిమా అభినందన సభకు చీఫ్ గెస్ట్ గా వెళ్లాడు బన్నీ. ఆ మూవీ టీమ్ ను ప్రశంసలతో ముంచెత్తాడు. ఈ క్రమంలోనే తన అప్​కమింగ్​ మూవీ ‘పుష్ప- ద రూల్స్’​లోని ఓ ఐకానిక్​ డైలాగ్​ను చెప్పి అభిమానులకు​ సర్​ప్రైజ్​ ఇచ్చాడు.  “ఈడంతా ఒకటే రూల్‌ మీద జరుగుతుండాది. పుష్ప గాడి రూలు” అంటూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు.

“సినిమాలు చూసి లేకుంటే.. స్క్రీన్‌ప్లే పుస్తకాలు చదివి రాస్తే వచ్చేది కాదు. జీవితాన్ని స్వయంగా చూసి.. రాస్తేనే అలాంటి చిత్రాలొస్తాయి. అలాంటి ‘బేబీ’ని తీసుకొచ్చిన దర్శకుడు సాయి రాజేష్‌కు కృతజ్ఞతలు. ఆనంద్‌ లేకపోతే ఈ చిత్రం ఇలా వచ్చేది కాదేమో. విరాజ్‌ చాలా క్యూట్‌గా కనిపించాడు. తెలుగులో తెలుగు కథానాయికలు పెద్దగా కనిపించడం లేదేంటన్న ప్రశ్న నన్నెప్పుడూ వేధిస్తుండేది. శ్రీలీల, ‘బేబీ’తో వైష్ణవి వచ్చాక తెలుగుమ్మాయిలకు టైం వచ్చిందనిపించింది. ” అని అల్లు అర్జున్​ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version