బిల్లులు చెల్లించాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి : సర్పంచుల జేఏసీ

-

ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను సైతం సంబంధిత అధికారులు పూర్తి చేసినట్లు సమాచారం. అయితే, కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటై ఏడాది పాలనలోనూ ఏర్పడ్డ పెండింగ్ బిల్లులను సర్పంచులకు చెల్లించాలకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సర్పంచుల జేఏసీ ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాసింది.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలలో చేసిన అభివృద్ధి పనులకు నేటికీ బిల్లులు చెల్లించలేదు. అందుకే సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
బిల్లులు చెల్లించకుండా ఎన్నికలు నిర్వహిస్తే బిల్లులు బాకీ ఉన్న సర్పంచులు అందరూ అడ్డుకుంటామని హెచ్చరికలు పంపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version