అనంతపురం కలెక్టరేట్‌లో కలకలం రేపింది. అనంతపురం కలెక్టరేట్‌లో జిల్లా రెవెన్యూ అధికారి నిర్వాకం బయట పడింది. రివ్యూ మీటింగ్ లో రమ్మీ ఆడుతూ కనిపించాడు అనంతపురం DRO మలోల. ఓవైపు రివ్వూ మీటింగ్ లో అధికాలు బిజీ ఉండగా..మరోవైపు DRO రమ్మీ ఆడటంపై ఖంగు తిన్నారు అధికారులు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.
ఇక అనంతపురం DRO మలోల వీడియో బయటకు రావడంతో అనంతపురం కలెక్టర్ సీరియస్ అయ్యారు. అనంతపురం DRO మలోల పై విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్.. కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
అనంతపురం: ఆన్ లైన్ పేకాటలో జిల్లా రెవెన్యూ అధికారి మలోల బిజీ బిజీ.
👉కలెక్టరేట్ లోని రెవెన్యూ భవన్లో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సమావేశం.
👉ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా, వ్యతిరేకంగా వినతి పత్రాలు ఇచ్చేందుకు వచ్చిన పలు సంఘాలను పట్టించుకోకుండా రమ్మీ… pic.twitter.com/YU1IfFrbhe— ChotaNews App (@ChotaNewsApp) January 21, 2025