జైలు నుంచి మామ చంద్రశేఖర్ ఇంటికి అల్లు అర్జున్ వెళతారని చెబుతున్నారు. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ ఇంట్లోనే అల్లు అర్జున్ ఫ్యామిలీ ఉందట. అందుకే జైలు నుంచి మామ ఇంటికి అల్లు అర్జున్ వెళతారని చెబుతున్నారు. ఇక అక్కడి నుంచి తన ఇంటికి వెళతారట అల్లు అర్జున్.
కాగా, చంచల్ గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల అయిన తర్వాత…. సొంత వాహనంలో వెనక గేటు నుంచి వెళ్లారు. అల్లు అర్జున్ కు ఎస్కార్ట్ ఇచ్చి ఇంటికి పంపారు అధికారులు. కాసేపట్లో ఇంటికి చేరుకోనున్నారట అల్లు అర్జున్. రాత్రి బెయిల్ ప్రక్రియ ఆలస్యం కావడంతో ఈ ఉదయం విడుదల అయ్యారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో శుక్రవారం అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. అల్లు అర్జున్ కు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది హై కోర్టు.