పింక్ క్రాప్​ టాప్​లో అనసూయ లేటెస్ట్ ఫొటోషూట్

-

టాలీవుడ్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ మరోసారి తన ఫొటోలతో నెట్టింట హల్​చల్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ స్టైలిష్ లుక్​లో కూల్​గా కనిపించింది. పింక్ క్రాప్ టాప్​.. వైట్ ప్యాంట్​లో అల్ట్రా పాష్​గా కనిపించి సందడి చేసింది. డిఫరెంట్​గా.. కూల్​గా పోజులిస్తూ మెస్మరైజ్ చేసింది. తన పెట్ డాగ్​తో కలిసి కూడా ఫొటోలు దిగింది.

ఈ ఫొటోలను తన ఇన్​స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసుకుంది. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అనూ.. యూ ఆర్ సో క్యూట్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇలా కూల్​గా కనిపిస్తే అనసూయ చాలా అందంగా ఉంటుంది.. ఇంత అందంగా కనిపిస్తుంటే ఇక పొట్టి పొట్టి బట్టలెందుకు వేసుకోవడం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక అనసూయ కెరీర్ సంగతికి వస్తే ఈ భామ బుల్లితెరపై రియాల్టీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ.. మరోవైపు వెండితెరపై తన సత్తా చూపిస్తోంది. ఈ ఏడాది ‘మైఖేల్’, ‘రంగమార్తాండ’, ‘విమానం’తో పాటు రీసెంట్​గా ‘పెద్ద కాపు’, ‘ప్రేమ విమానం’ చిత్రాలతో అలరించింది. ప్రస్తుతం ‘ఫ్లాష్​ బ్యాక్​’, ‘పుష్ప 2’ చిత్రాల్లో నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news