అన్నంత పని చేసేసిన అనసూయ.. ఇక వారికి తిప్పలే..!!

-

ప్రముఖ యాంకర్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా తన అంద చందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా జబర్దస్త్ వంటి కార్యక్రమాలలో ఎక్కువగా అనసూయ అందాలను చూడడానికే అభిమానులు ఎక్కువగా జబర్దస్త్ కార్యక్రమాన్ని చూస్తారు అనడంలో సందేహం లేదు. అంతగా తన నటనతో , అందాల ఆరబోతతో మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా ఇటీవల యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో విపరీతంగా పాపులర్ అయింది. అందుకు కారణం లైగర్ రిజల్ట్ ను చూసి అనసూయ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు ఊహించిన విధంగా వైరల్ అయ్యాయి.

ఇకపోతే అనసూయ ట్వీట్స్ పై హద్దులు దాటి స్పందించిన నెటిజనులకు ఆమె ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ రిప్లై ఇస్తూ వచ్చింది. ఇక ఇప్పుడు మరొకసారి అనసూయ తనపై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యింది. “అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు.. కర్మ కొన్నిసార్లు రావడం లేట్ అవ్వోచ్చేమో కానీ.. రావడం మాత్రం పక్కా” అంటూ అనసూయ చేసిన వ్యాఖ్యలు ట్విట్టర్లో ఒక్కసారిగా వైరల్ అయిపోయాయి. అయితే ఈ విషయంపై స్పందించిన కొంతమంది ఎప్పుడో జరిగిపోయిన గొడవలు ఇప్పుడు ఎందుకు హైలెట్ చేయడం అంటూ అనసూయ ట్వీట్ పై తీవ్ర స్థాయిలో అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఇక మరికొంతమంది చాలా ఘాటుగా ఆంటీ అంటూ ఆమెను ఎగతాళి చేయడమే కాకుండా బాడీ షేమింగ్ పై ఏమాత్రం తగ్గకుండా అనసూయను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు.

ఈ క్రమంలోనే అనసూయ తన సహనాన్ని కోల్పోయి ఇప్పుడు అన్నంత పని చేసింది.. ఇన్ని రోజులూ ఏమన్నా మారుతారేమో అని ఎదురు చూశాను.. కానీ అసభ్యకరమైన పదజాలంతో బాడీ షేమింగ్ చేస్తున్న వారు ఏమాత్రం మారలేదు. అందుకే ఇప్పుడు సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేయడం తప్పలేదు అంటూ ఆమె తెలిపింది. ఇక వెంటనే మద్దతు ఇచ్చిన సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు కూడా తీసుకుంటామని తెలిపారు. అయితే ఇదే విషయాన్ని అనసూయ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఇకపోతే నెటిజన్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొక్క తప్పదు అని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version