మ‌రో వివాదంలో చిక్కుకున్న యాంక‌ర్ ప్ర‌దీప్‌ .. అస‌లు విష‌యం ఏంటంటే?

-

పాపం ప్ర‌దీప్ ఈ మధ్య వ‌రుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అప్ప‌ట్లో మ‌ద్యం తాగి దొరికితే ఎంత పెద్ద ర‌చ్చ అయిందో అంద‌రికీ తెలిసిందే. దాని నుంచి బ‌య‌ట ప‌డ‌టానికి ఆయ‌న‌కు చాలాకాలం ప‌ట్టింది. ఇప్పుడు మ‌రో వివాదంలో చిక్కుకున్నాడు యాంక‌ర్ ప్ర‌దీప్‌. అయితే ఇప్పుడు జ‌రిగిన వివాదంలో చాలా అనూహ్యంగా ఇరుక్కున్నారని తెలుస్తోంది.

యాంక‌రింగ్‌ల‌తో పాటు అప్పుడప్పుడు ప్రోగ్రామ్‌ల‌కు హాజ‌ర‌వుతుంటారు స్టార్ యాంక‌ర్ ప్ర‌దీప్‌. ఇదే క్ర‌మంలో రీసెంట్‌గా ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు ఆయ‌న‌. అయితే ఈ కార్య‌క్ర‌మంలో ఆయ‌న నోరుజారారు. ఇదే ఇప్పుడు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది.

ఏపీలో రాజ‌ధాని విశాఖ‌ప‌ట్నం అంటూ ప్ర‌దీప్ నోరుజారారు. దీంతో ఈ వ్యాఖ్య‌ల‌పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ వివాదం కోర్టు దాకా వెళ్లింది. సున్నిత‌మైన అంశంపై ఆయ‌న ఎలా మాట్లాడుతారంటూ మండిప‌డుతున్నారు ఏపీ ప్ర‌జ‌లు. ప్ర‌దీప్ బ‌హిరంగంగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాలంటూ చాలామంది డిమాండ్ చేస్తున్నారు. ల‌క్ష‌ల‌మంది రైతులు, ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను దెబ్బ‌తీసే విధంగా ప్ర‌దీప్ మాట్లాడాడంటూ, ఆయ‌న ఇంటిని కూడా చుట్టుముడుతామ‌ని హెచ్చ‌రిస్తున్నారు. చూడాలి మ‌రి దీనిపై ప్ర‌దీప్ ఎలా స్పందిస్తారో.

Read more RELATED
Recommended to you

Exit mobile version