రష్మిపై నెగిటివ్ కామెంట్స్.. బ్యూటీ కౌంటర్ కు నెటిజన్ షాక్

-

టాలీవుడ్ యంగ్ యాంకర్లలో రష్మి గౌతమ్ది ప్రత్యేక స్థానం. ఎన్నో ఏళ్ల నుంచి ఈ భామ యాంకర్గా రాణిస్తోంది. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బుల్లితెరను ఏలుతోంది. ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. తాజాగా ఈ భామ చేసిన ఓ పోస్టుపై నెటిజన్ స్పందించిన తీరుపై రష్మి తీవ్రంగా ఫైర్ అయింది. ఇంతకీ ఈ బ్యూటీ చేసిన పోస్టు ఏంటంటే?

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంపై ఆనందం వ్యక్తం చేస్తూ రష్మి ఇటీవల ట్వీట్‌ చేసింది. దీనిపై ఓ నెటిజన్‌  ‘‘అసభ్యకర పనులు చేసి భగవంతుడి నామాన్ని జపిస్తే అన్ని తుడిచిపెట్టుకుపోతాయా..?’’ అని వ్యంగ్యంగా కామెంట్‌ పెట్టాడు. దీనిపై రష్మి రియాక్ట్ అవుతూ ‘‘నేనేమైనా డబ్బులు ఎగ్గొట్టానా? కుటుంబ బాధ్యత మరిచి తల్లిదండ్రులను రోడ్డు మీద వదిలేశానా? ట్యాక్సులు చెల్లించడం లేదా? చట్ట విరుద్ధమైన పనులు చేస్తున్నానా? మీ దృష్టిలో అసభ్యకరమైన పనులంటే ఏమిటి? ఈ మధ్య కాలంలో ఇలాంటి మాటలు ఎక్కువగా వింటున్నా. నా వరకు భగవంతుడు సర్వాంతర్యామి. సనాతన ధర్మంలోని మంచి విషయం అదే’’ అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

ప్రస్తుతం రష్మి రిప్లై వైరల్ అవుతోంది. ఇక రష్మి ఫ్యాన్స్ మాత్రం ఈ భామ ఇచ్చిన కౌంటర్కు తెగ ఖుష్ అవుతున్నారు. నెటిజన్ షాక్.. రష్మి రాక్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version