ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్!

-

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో పలు కీలక సీన్లను చిత్రీకరించారు. ఇక ఈ చిత్రం మరో రెండు మూడు నెలల్లో విడుదలకు సిద్ధంగా ఉందంటూ చిత్రబృందం ఇప్పటికే పలుమార్లు చెప్పింది. అలా ఈ సినిమా ఏప్రిల్లో విడుదలవుతుందంటూ నెట్టింట మొన్నటిదాకా వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా మాత్రం దేవర రిలీజ్ వాయిదా పడిందంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది.

ఫుల్ ఆన్ యాక్షన్ మోడ్లో రూపొందుతున్న ఈ మూవీ రెండు పార్టులుగా విడుదల కానుండగా ఇప్పటికే తొలి భాగాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు రిలీజ్ వాయిదా వార్తలు వస్తున్న తరుణంలో సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని, వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి చేసుకునేందుకు ఇంకాస్త సమయం పడుతుందని సమాచారం. మరోవైపు ఈ సినిమాలో విలన్ రోల్ చేస్తున్న సైఫ్ అలీ ఖాన్ ఇటీవలే గాయల పాలయ్యారు. తిరిగి ఆయన సెట్స్కు వచ్చేందుకు కాస్త సమయం పడుతుంది. ఇలా పలు కారణాల వల్ల దేవర రిలీజ్ వాయిదా పడనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version